April 12, 2026
Explore
మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి

మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి

April 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృత్యువాత పడ్డ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. పొన్నూటి పాళ్యం పంచాయతీ, బెంగళూరు రోడ్డులోని చిప్పిలిలో కాపురం ఉంటున్న వీరభద్ర (55) భవన కార్మికుడిగా పనిచేస్తాడు. మిద్దెపైన పడుకోవడానికి శనివారం రాత్రి వెళ్లి ప్రమాద వశాత్తు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అనంతరం రుయా కు వెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు.

Tags: Construction worker dies after falling from platform