April 12, 2026
Explore
తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

April 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని, మదనపల్లె మండలం, తట్టివారిపల్లి చెరువు వద్ద ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు మృతితేహాన్ని గుర్తించి వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. పంచినామా అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు. చనిపోయిన వ్యక్తి స్థానిక కొత్తపల్లి పంచాయతీ, రంగారెడ్డికాలనీ (కొత్త ఇండ్ల)కు చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు శంకర్ గా గుర్తించారు. మద్యం మత్తులో నీటి తొట్టిలో పడి ఊపిరాడిక చనిపోయాడా లేక ఎవరైనా తలకు బలంగా కొట్టడంతో చనిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాల్చి ఉంది.

Tags: Suspicious death of a person at Tattivaripalle Cheruvu