తిరుపతి ముచ్చట్లు:
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు రూ.10 లక్షలు విరాళం అందింది.ముంబైకి చెందిన రాజేంద్ర జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ లు బేరూలాల్ జైన్, మీనేష్ జైన్ లు ఈ విరాళాన్ని అందించారు.తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్రకు దాతలు విరాళం డీడీలను బుధవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాతలను టిటిడి ఈవో అభినందించారు.
Tags: Donation of Rs. 20 lakhs to TTD Trusts