April 11, 2026
Explore
21న శంకర జయంతి , ఉపనయనాలను జయప్రదం చేయండి

21న శంకర జయంతి , ఉపనయనాలను జయప్రదం చేయండి

April 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతిని , బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమాల్లో బ్రహ్మణులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ గాయత్రిమాత తాలూక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆర్‌కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణ సమీపంలోని బైపాస్‌ రోడ్డులో గల శ్రీ ప్రసన్న పార్వతిసమేత శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అక్కడే ఉపనయన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వటువుల నమోదు కార్యక్రమాన్ని సెల్‌నెంబరు:9492074348 కు సమాచారం ఇవ్వలన్నారు. ఈ సందర్భంగా హోమాలు, ఉపనయనాలు, అభిషేక కార్యక్రమాలు , అన్నవితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిదులు శేషగిరి, టివిఎస్‌.ప్రసాద్‌, ఫణిభాస్కర్‌, అశ్వర్థనారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags; Shankara Jayanti falls on the 21st; make the Upanayana ceremonies a success.