April 11, 2026
Explore
12న మోడల్‌స్కూల్‌ ప్రవేశ పరీక్ష

12న మోడల్‌స్కూల్‌ ప్రవేశ పరీక్ష

April 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అడ్మీషన్లకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌ టిఎన్‌.రమ తెలిపారు. శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవేశపరీక్షకు హాజరైయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు తమ హాల్‌టికెట్టుతో పాటు బ్లూ లేదా బ్లాక్‌ పెన్ను, అట్ట తీసుకుని రావాలెనని ఆమె కోరారు.

Tags; Model School Entrance Exam on the 12th