పుంగనూరుముచ్చట్లు:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహత్మాజ్యోతిరావుపూలే ఆశయాలను కాపాడుతామని పలు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఇందిరా సర్కిల్‌లో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.పూలే అమర్ రహే అంటు నినాదాలు చేశారు. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సామాజిక ఉధ్యమకారుడు పూలే అని కొనియాడారు. బహుజనులకు విద్యనందించి వారి జీవితాలకు మార్గదర్శకుడిగా నిలిచిన పూలే మహానీయుడని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అద్దాలనాగరాజ, వెంకటరమణారెడ్డి, ఈశ్వరమ్మ, రమణ, వెంకటరెడ్డి, కుమార్, జగదీష్‌తో పాటు ఏఎస్‌ఐ అశ్వర్థనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags: We will uphold the ideals of Jyotirao Phule.