April 11, 2026
Explore
భగత్‌సింగ్‌ కాలనీలో పోలీస్‌ సోదాలు

భగత్‌సింగ్‌ కాలనీలో పోలీస్‌ సోదాలు

April 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో శనివారం వేకువజామున పోలీసులు ప్రతి ఇల్లు జల్లెడ పట్టారు. సీఐలు సుబ్బరాయుడు, సాయినాథ్‌ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు ప్రతి ఇంటిలోని వారిని విచారించారు. అనుమానితులను, అనుమానిత వస్తువులను, రికార్డు లేని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు ఆప్రాంత వాసులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ దీరజ్‌కునుబిలి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. అనుమానితులను ఇండ్లలో పెట్టుకోవడం, రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న లేదా అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల కర్తవ్యంగా పని చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కోసం పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లు అన్సర్‌బాషా, రమణ, చంద్రశేఖర్‌ , రమేష్‌తో పాటు పోలీసులు పాల్గొన్నారు.

Tags; Police Raids in Bhagat Singh Colony