ఓబులవారిపల్లి ముచ్చట్లు:
వ్యవసాయంలో నష్టం రావడంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం.. సారా సురేష్ అనే రైతు వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పంటల్లో నష్టం రావడంతో అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో తన వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన గ్రామస్తులు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags: Farmer commits suicide due to agricultural losses