April 11, 2026
Explore
29 మంది డీఎస్పీల బదిలీ..19 మందికి ఎసీపీవోలుగా అవకాశం

29 మంది డీఎస్పీల బదిలీ..19 మందికి ఎసీపీవోలుగా అవకాశం

April 11, 2026 | Andhra Pradesh

గుడివాడ డిఎస్పీగా పి.శ్రీనివాస్ నియామకం

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీష్కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.వారిలో 19 మందిని వివిధ సబ్ డివిజన్లకు ఎల్డీపీవోలుగా (సబ్ డివిజనల్ పోలీసు అధికారులుగా) నియమించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలో (2018 నాటి నోటిఫికేషన్) డీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన 25 మందిని హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ప్రాధాన్య పోస్టుల్లో నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఖాళీ అయిన కొన్ని సబ్డివిజన్లలో వేరేవారిని నియమించారు.మిగతా వారిని స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, ట్రాఫిక్ విభాగాల్లో డీఎస్పీలుగా బదిలీ చేశారు.

Tags: 29 DSPs Transferred; 19 Given Opportunity as ACPs