April 11, 2026
Explore
అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే కృషి

అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే కృషి

April 11, 2026 | Andhra Pradesh

పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకం

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విజయవాడ ముచ్చట్లు:

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శనివారం నాడు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కులకు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు. సామాజిక ఉద్యమాలు నడిపి నిస్వార్థంగా సామాజిక వికాసానికి విలువలు నేర్పుతూ మార్గదర్శిగా నిలిచారన్నారు. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని దేవినేని ఉమా పేర్కొన్నారు.

Tags: Mahatma Jyotirao Phule’s efforts for the upliftment and educational advancement of the marginalized sections.