అమరావతిముచ్చట్లు:
•ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు వర్తించేలా ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025’ గెజిట్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
•కొత్త గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తే, ప్రస్తుతం ఉన్న 1975 నాటి పాత పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ రద్దు అవుతుంది.
•దీని ప్రకారం రాష్ట్రంలో ఇకపై 26 జిల్లాలు, ఆరు జోన్లు మరియు రెండు మల్టీ జోన్లు అమలులోకి వస్తాయి.
•ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మరియు బదిలీలకు
ఇకపై ఈ కొత్త విధానాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.
•గతంలో స్థానికతను ఉమ్మడి 13 జిల్లాల ఆధారంగా నిర్ణయించగా, ఇకపై కొత్త 26 జిల్లాల ప్రాతిపదికన నిర్ణయిస్తారు.
•రాష్ట్ర స్థాయి పోస్టులను కూడా ఇకపై మల్టీ జోన్ కేడర్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
•ఈ నూతన పాలసీ ద్వారా పరిపాలనలో మరింత స్పష్టత, ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి.
Tags; Andhra Pradesh New Zones and Multi-Zones: