మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె తాలూకా సిఐ దళితులపై దాడి చేశారని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని వైరల్ చేస్తుండడాన్ని అన్నమయ్య జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
మదనపల్లె తాలూకా సిఐ కళా వెంకటరమణ శనివారం ఒక వీడియో విడుదలచేశారు. స్థానిక గాంధీపురానికి చెందిన రామకృష్ణ మరి కొందరిని పోలీసులు విచారణ పేరుతో స్టేషన్ కు పిలిపించి లాఠీతో కొట్టి, బట్టలు చించి, మహిళలతో దళితులపట్ల అనుసితంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జోరుగా చేస్తున్నారన్నారు. అది వాస్తవం కాదని అలా తప్పుడు ప్రచారం వైరల్ చేస్తే చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా పోలీసుల హెచ్చరికతో ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో దళితులు ముందుగా వేసుకున్న ప్లాన్ పై క్రియేట్ చేసి నట్లుగా విడుదల చేశారు.
Tags: Police serious about fake campaign on social media claiming CI attack on Dalits