April 11, 2026
Explore
రాయచోటిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా

రాయచోటిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా

April 11, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని మాసాపేట బ్రిడ్జి వద్ద ఉన్న పూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, యువనాయకుడు మౌర్యా రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పూలే కులవివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు, మహిళా విద్యా ప్రోత్సాహకుడు అని కొనియాడారు. అణగారిన వర్గాల సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఆశయాలతో పాటు పూలే సిద్ధాంతాలు దేశ ప్రగతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Jyotirao Phule Birth Anniversary Celebrations Held Grandly in Rayachoti