పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ పోలీసులు కాలనీని చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు.
సుమారు 50 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇల్లు, వీధిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు పత్రాలు లేని వాహనాలపై పరిశీలనలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులతో మాట్లాడి భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags: Police Conduct Cordon and Search Operation in Bhagat Singh Colony