April 10, 2026
Explore
సీటుపై కుర్చుందని వృద్ధురాలిపై కండక్టర్‌ దాడి

సీటుపై కుర్చుందని వృద్ధురాలిపై కండక్టర్‌ దాడి

April 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచితం ఏమాత్రమో తెలియదు కానీ కండక్టర్‌ సీటులో తెలియకుండ కుర్చున్న నేరానికి వృద్ధ మహిళపై దాడి చేసి బూతుపురణాలతో బస్సులో భీభత్సవం సృష్టించిన ఓ కండక్టర్‌ వింత ప్రవర్తన శుక్రవారం జరిగింది. పుంగనూరు డిపోకు చెందిన ఏపి:39 జె:0023 బస్సు పుంగనూరు నుంచి మదనపల్లెకి వెళ్లింది. ఈ సమయంలో ఓ వృద్ధ మహిళ సీటు కోసం తారాడుతూ కండక్టర్‌ సీటు ఖాళీగా ఉండటంతో కుర్చుంది. కండక్టర్‌ వచ్చిన ఆమె లేవకపోవడంతో కండక్టర్‌ రెచ్చిపోయాడు. ప్రయాణికులు అడ్డుకున్న తోసుకుంటు వెళ్లి ఆమెను అనరానిమాటలు అంటు సీటులో నుంచి లాగిపడేశాడు. అడ్డు వచ్చిన ప్రయాణికులను సైతం అతను లెక్కచేయకుండ పత్రికల్లో రాయలేని విధంగా దూషించి ప్రతి ఒక్కరిపై దాడి చేసేందుకు సిద్ధమైయ్యాడు. కండక్టర్‌ దురుసు ప్రవర్తనను వీడియోల్లో రికార్డు చేస్తున్న వారిని కూడ అనరాని మాటలు అని దూషించినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పైగా నన్ను ఎవరు ఏమి చేయలేరు… ఏం చేస్తారో చేసుకోండి…అంటు ప్రయాణికులపై సవాల్‌ విసరడంతో ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆర్టీసి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Tags: Conductor attacks elderly woman for sitting on a seat.