October 29, 2026
Explore
కారు ఢీకొని టూరిజం ఉద్యోగికి తీవ్ర గాయాలు

కారు ఢీకొని టూరిజం ఉద్యోగికి తీవ్ర గాయాలు

October 29, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో గురువారం కారు బైకును ఢీ కొట్టడంతో ఏపీ టూరిజం ఉద్యోగికి తీవ్ర గాయా లయ్యాయి. బాదితుడు తిరుపతి కొర్లగుంటకు చెందిన చెన్నారెడ్డి కుమారుడు సి. ప్రభాకర్ రెడ్డి (55) హార్సిలీ హిల్స్‌పైన ఏపీ టూరిజంలో పని చేస్తున్నారు. బైకుపై కొండపైకి వెళ్తుండగా, పైనుంచి వస్తున్న కారు ఢీకొని కాలు విరిగింది. క్షతగాత్రుడిని అదే కారులో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు మదనపల్లె సబ్ కలెక్టరేట్ సిబ్బందిదని బాధితుడు చెబుతుండగా, సిబ్బంది మాత్రం రోడ్డుపై పడి ఉంటే తాము తీసుకొచ్చా మంటున్నారు.

Tags:Tourism employee sustains severe injuries after being hit by a car