October 29, 2026
Explore
అమెరికాలో అణు ప్రమాదం

అమెరికాలో అణు ప్రమాదం

October 29, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో బుధవారం నాడు యూఎస్ ఇంధనశాఖకు చెందిన సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో రేడియేషన్ లీకయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే, సిబ్బంది రెండు గంటల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయటి ప్రాంతాల్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags; Nuclear accident in America