April 10, 2026
Explore
సముద్ర తీర భద్రత బలోపేతం – సంయుక్త బోటు పట్రోలింగ్ నిర్వహణ.

సముద్ర తీర భద్రత బలోపేతం – సంయుక్త బోటు పట్రోలింగ్ నిర్వహణ.

April 10, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • కృష్ణపట్నం పోర్ట్ నుండి వైట్ కుప్పం వరకు కట్టుదిట్టమైన నిఘా.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాలలో భద్రతను మరింత పటిష్టం చేయుటకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది.
  • ఈ నేపథ్యంలో, కృష్ణపట్నం పోర్ట్ నుండి వైట్ కుప్పం వరకు సముద్ర మార్గంలో బోటు పట్రోలింగ్ నిర్వహించబడింది. వాకాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో మెరైన్ పోలీస్ సిబ్బంది మరియు ఫిషరీస్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సంయుక్తంగా ఈ పర్యవేక్షణ కార్యక్రమం చేపట్టబడింది.
  • పట్రోలింగ్ సమయంలో సముద్ర మార్గం ద్వారా జరుగవచ్చిన అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచడమేగాక, తీర ప్రాంత భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించడం జరిగింది.
  • అదనంగా, మత్స్యకారులకు సముద్రంలో ప్రయాణించే సమయంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది.
  • అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన పక్షంలో తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని వారికి సూచించబడింది.
  • జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రతను కాపాడడంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా, కట్టుబడి పనిచేస్తుందని అధికారులు తెలిపారు.

Tags: Strengthening Coastal Security – Conducting Joint Boat Patrols.