ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లో ఓ మహిళను వివాహం చేసుకోవడం కోసం, ఆమెకు చెందిన 18 నెలల పసికందును పదే పదే నేలకేసి కొట్టి చంపిన జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్కు కోర్టు మరణశిక్ష విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఫిరోజాబాద్ జిల్లా & సెషన్స్ కోర్టు రికార్డు స్థాయిలో కేవలం 41 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి అతడిని దోషిగా తేల్చింది. ఈ ఘోర నేరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Tags: Man who beat a one-year-old child to death sentenced to death in just 41 days