April 10, 2026
Explore
నగదు టోల్‌కు గుడ్‌బై.. FASTag/UPI తప్పనిసరి

నగదు టోల్‌కు గుడ్‌బై.. FASTag/UPI తప్పనిసరి

April 10, 2026 | Andhra Pradesh

– నేటి నుంచే కొత్త నిబంధనలు అమలు!

అమరావతిముచ్చట్లు:

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. నేటి (శుక్రవారం) నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ కొత్త విధానాన్ని అమలు చేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా FASTag లేదా UPI ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

టోల్ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగదు చెల్లింపులు నిలిపివేయడంతో టోల్‌ప్లాజాల వద్ద క్యూలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.

ఈ మార్పులతో పాటు టోల్ ఛార్జీల్లో కూడా పెంపు జరిగింది. సగటున 10% వరకు టోల్ రేట్లు పెరిగాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1.5% నుంచి 3.5% వరకు పెంపు అమలులోకి వచ్చింది. అలాగే, తరచూ ప్రయాణించే వాహనదారుల కోసం వార్షిక టోల్ పాస్ ధరను రూ.3,075గా నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ వాహనాలకు FASTag అమలు చేయించుకోవడం లేదా UPI సదుపాయం సిద్ధంగా ఉంచుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

Tags: Goodbye to Cash Tolls: FASTag/UPI Mandatory