💠జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అధికారి.
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా లో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా ఎం. రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా పూలమొక్కను అందజేసి కలిశారు.
ఎం. రవికుమార్ పోలీసు శాఖలో తన ప్రస్థానాన్ని 2009లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రారంభించారు. తన సుదీర్ఘ సర్వీసులో అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు రైల్వే శాఖలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన, అత్యంత కీలకమైన గ్రేహౌండ్స్ విభాగంలోనూ పనిచేశారు. తాజాగా బదిలీపై అన్నమయ్య జిల్లాకు విచ్చేసి నేడు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్ కు అభినందనలు తెలుపుతూ పలు కీలక సూచనలు చేశారు. “జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో రిజర్వ్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైంది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ తన అనుభవంతో జిల్లాలోని పోలీసు సిబ్బందిని సమన్వయపరుస్తూ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, ప్రజల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా కృషి చేయాలి.” అని ఆదేశించారు.
Tags:M. Ravikumar assumes charge as the new District Reserve Inspector.