April 10, 2026
Explore
మాచర్ల ప్రభుత్వ ఉద్యోగి కేసులో నిందితుడి అరెస్టు:

మాచర్ల ప్రభుత్వ ఉద్యోగి కేసులో నిందితుడి అరెస్టు:

April 10, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో నిందితుడు దొరికాడు. ఈ కేసులో బాధితురాలికి సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తే నిందితుడిగా తేల్చారు పోలీసులు. పల్నాడు జిల్లా రాజుపాలేనికి చెందిన నామాల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఆమె ఇంటికి ఆహ్వానించింది.. నేరుగా వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడి చేశాడు.

  • పల్నాడు జిల్లా అత్యాచారం కేసు నిందితుడి అరెస్ట్
  • ఈ నెల 2న అతడ్ని ఇంటికి ఆహ్వానించిన మహిళ
  • ఆమెను బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడు

పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపిన ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసు మిస్టరీ వీడింది. ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ అఘాయత్యానికి ఒడిగట్టినట్లు తేలింది.. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు మాచర్లలోని ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు గతంలో వివాహంకాగా.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఆ మహిళకు సోషల్ మీడియా ద్వారా రాజుపాలెం మండలానికి చెందిన యువకుడు నామాల శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు. మహిళ ఈ నెల 2న ఆ యువకుడిని ఇంటికి ఆహ్వానించింది. గూగుల్ మ్యాప్ లొకేషన్‌తో యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు.

ఆ యువకుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించడంతో ప్రతిఘటించడంతో దాడి చేశాడు. బాధితురాలి చేతులు, కాళ్లు కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలి తనకు తెలిసిన వ్యక్తికి సమాచారం ఇవ్వగా.. ఆ వ్యక్తి తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఎదురింట్లో ఉన్న ఒక మహిళ సహాయంతో బాధితురాలిని రక్షించి 108 ద్వారా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం గాలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి బాధితురాలు తెలిపిన ప్రకారం నిందితుడి గురించి వివరాలు సేకరించారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను పరిశీలించారు.

ఈ కేసులో నిందితుడిని ఈ నెల 8న ఉదయం 09.15 నిమిషాలకు మాచర్ల రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడ్ని మాచర్ల కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో గురజాల సబ్‌జైలుకు తరలించారు. బాధిత మహిళ పరిచయస్తుడే ఇలా చేయడంతో పోలీసులకు నిజం చెప్పలేదంటున్నారు. సీసీ ఫుటేజ్, ఛాటింగ్, ఇతర డేటా ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు.

‘ఈ నెల 2న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటికి వచ్చాడు. అతడు నీళ్లు అడగటంతో నీళ్లు తీసుకొని రావడానికి లోపలికి వెళ్లింది. ఆ వ్యక్తి ఆమె వెంట వెళ్లి ఆమె జుట్టు పట్టుకొని నోరు మూసి కత్తితో బెదిరించగా.. ఆమె భయంతో ఫిర్యాదు బట్టలు తీసివేసినట్లు చెప్పారు. ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి నోరు మూసి దారుణంగా దాడి చేసి, ఆమె చేతులు,కాళ్లు చున్నీ తో కట్టి బెదిరించి అక్కడి నుంచి పారిపోయినట్లుగా చెప్పారు’ అని పోలీసులు ప్రకటనలో తెలిపారు.

Tags; Arrest of the Accused in the Macherla Government Employee Case