పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి ఎస్టీ సెల్ ప్రతినిదులుగా నియమితులైన వారికి శుక్రవారం ఎస్టీ సంఘ నాయకులు, ప్రజలు సుగాలిమిట్టలో సన్మానం చేశారు. వైఎస్సార్‌సిపి రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్రనాయక్, జిల్లా కార్యదర్శి శ్రీరాములునాయక్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాసునాయక్, ప్రధాన కార్యదర్శులు శీననాయక్, నాగరాజనాయక్‌తో పాటు 15 మందిని కేంద్ర పార్టీ కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా ఎస్టీల నాయకులు, ప్రజలు నూతన ప్రతినిధులకు శాలువలుకప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మునీంద్రనాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల సూచనల మేరకు గిరిజనతాండాలలో పార్టీని పటిష్టంచేసి, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసులునాయక్, రామయ్య, వెంకట్రమణనాయక్, మనోజ్‌కుమార్‌నాయక్, చిన్నరాయులు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags: Felicitation of YSRCP ST Representatives