వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మొక్కల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. మండలానికి చెందిన షేక్ మహమ్మద్ (55) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. బంగారం కొనుగోలు కోసం సుండుపల్లికి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఆయన ఉరివేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుస్మిత పోలీసు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Tags; Businessman commits suicide due to family dispute