April 10, 2026
Explore
రాజ్‌నాథ్‌సింగ్‌ చే పిహెచ్‌డి అందుకున్న శ్రీరాజ్‌కుమార్‌

రాజ్‌నాథ్‌సింగ్‌ చే పిహెచ్‌డి అందుకున్న శ్రీరాజ్‌కుమార్‌

April 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కొత్తయిండ్లలో నివాసం ఉన్న ప్రభాకర్‌పాల్‌ కుమారుడు ఆర్‌.శ్రీరాజ్‌కుమార్‌ కు కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిహెచ్‌డిని శుక్రవారం ప్రధానం చేశారు. నోయిడా ఇంటర్నేషనల్‌ యూనివర్శిటిలో పబ్లిక్‌హెల్త్ పై పిహెచ్‌డి చేసి వ్యాసాలను సమర్పించినందుకు ఆయనకు పిహెచ్‌డిని ప్రధానం చేశారు. కాగా శ్రీరాజ్‌కుమార్‌ స్థానిక కొత్తయిండ్లు హైస్కూల్‌, బసవరాజ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. ప్రస్తుతం ఆయన యూపిలోని గ్రేటర్‌నోయిడా శారదా విశ్వవిద్యాలయం నర్సింగ్‌ విభాగంలో డిఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు పిహెచ్‌డి రావడంపై ఆయన బంధువులు ఆర్థర్‌పాల్‌, అనిల్‌కుమార్‌తో పాటు సిఎస్‌ఐ చర్చిప్రతినిదులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

Tags: Sri Rajkumar receives PhD from Rajnath Singh.