తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గువాహటిలో పవన్ ఖేరాపై కేసు నమోదు అయింది. దీంతో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారంలోగా సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.
Tags: Anticipatory Bail for Pawan Khera