పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి ప్రారంభంకానున్నది. మూడు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పాటలపోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటి అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు. గురువారం దర్గాను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో పూజలు నిర్వహిస్తున్నారు. 11, 12వ తేదీలలో ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తాన, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్, ఇంతేజుర్‌రిష్టి లచే రెండు రోజుల పాటు ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బయట ప్రాంతాలకు చెందిన వందలాది మంది ముస్లింలు ఉరుసు మహ్గత్సవంలో పాల్గొనేందుకు దర్గా ప్రాంతం చేరుకుంటున్నారు. అందరికి భోజన, వసతి సౌకర్యాలను దర్గా కమిటి ఏర్పాటు చేశారు.
Tags: Urs at Cheemanapalle Dargah on the 10th.