July 16, 2026
Explore
నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

July 16, 2026 | Andhra Pradesh

ఒడిశాముచ్చట్లు:

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. 9 రోజులపాటు జరిగే ఉత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ప్రత్యేక రథాలపై గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఆ రథాలను లాగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. యాత్ర ప్రారంభానికి ముందు ఒడిశా రాజు బంగారు చీపురుతో రథం మార్గాన్ని ఊడుస్తారు. ఈ సంప్రదాయాన్ని ‘ఛేరా పహారా’ అంటారు. ఇది ‘దైవం ముందు అందరూ సమానులే’అనే సందేశాన్ని ఇస్తుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రతో కలిసి మూడు రథాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. నందిఘోష, తాళధ్వజం, దర్పదళన్ రథాలను ఆలయ సింహద్వారం వద్దకు చేర్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో ఒడిశా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ యాత్ర ఈ నెల 24న ముగుస్తుంది.

పూరీ రథ యాత్ర విశేషాలు

  • ఏటా ఆషాఢ మాసం శుక్ల పక్ష విదియ నాడు రథ యాత్ర ప్రారంభం అవుతుంది.
  • జగన్నాథుని రథం పేరు నందిఘోష, బలభద్రుని రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన’
  • సుమారు 45 అడుగుల ఎత్తు ఉండే ఈ రథాలను వేప, సాల్, ధౌరా, సింబల్ వంటి ప్రత్యేకమైన కలపతో ఏటా కొత్తగా తయారు చేస్తారు.
  • స్వామివారు గుండిచా మందిరంలో బస చేసి 9వ రోజున తిరిగి వచ్చే యాత్రను ‘బహుడా యాత్ర’ అంటారు.

Tags: Puri Rath Yatra begins today.