తెలంగాణముచ్చట్లు:
తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల భక్తికి ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరంలోని ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.
Tags; Ashada Bonalu begins today…