పుంగనూరు ముచ్చట్లు:
తపాలాశాఖ అంటే ప్రజలకు నమ్మకం, భరోసా కలిగి ఉందని పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉద్యోగులు, కస్టమర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న ఘనత తపాలాశాఖదేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి తపాలాశాఖ విధివిదానాలను మరింతగా తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో పోస్టుమాస్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags: The Postal Department stands for trust.