April 9, 2026
Explore
విద్యార్థుల్లో భద్రతా అవగాహన – శక్తి టీం ప్రత్యేక కార్యక్రమం.

విద్యార్థుల్లో భద్రతా అవగాహన – శక్తి టీం ప్రత్యేక కార్యక్రమం.

April 9, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణతో పాటు సైబర్, చైల్డ్ సేఫ్టీపై అవగాహన.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీం ద్వారా విద్యార్థుల్లో భద్రతా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం జరిగింది.
  • ఈ క్రమంలో ఈ రోజు కోర్లగుంటలోని ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు కరాటే మరియు సెల్ఫ్ డిఫెన్స్ పై ప్రాథమిక శిక్షణ అందించడంతో పాటు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి స్పష్టమైన అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణ (Discipline), నైతిక విలువలు (Moral Values) పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు.
  • అదేవిధంగా, ఇంటి చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు, మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడడం వల్ల జరిగే ప్రభావాలు, తెలియని లింకులను క్లిక్ చేయడం వల్ల జరిగే సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
  • ఇంకా, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్ వంటి అంశాలపై విద్యార్థులకు వివరంగా తెలియజేసి, ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే చైల్డ్ లైన్ 1098, పోలీస్ హెల్ప్‌లైన్ 112 కు సమాచారం అందించాలని సూచించారు.
  • ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా, ఆత్మరక్షణ పట్ల నమ్మకం పెంచే దిశగా శక్తి టీం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.

Tags:Safety Awareness Among Students – A Special Program by the Shakti Team.