April 9, 2026
Explore
విజయవాడలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

విజయవాడలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

April 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, RTI యాక్టివిస్ట్స్ అసోసియేషన్ (AP & TS) ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన సదస్సు మరియు సభ్యుల పరస్పర సమావేశం నిర్వహించబడుతోంది.ఈ కార్యక్రమం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్ గోల్డెన్ వే నందు 14/04/2026 ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా RTI యాక్టివిస్ట్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కన్వీనర్ స్వర్ణ శివ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, ప్రజల హక్కులపై చర్చించడం మరియు సభ్యుల క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే వివిధ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సదస్సుకు RTI కార్యకర్తలు, యువత మరియు ఆసక్తి గల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజ్ఞానాన్ని పొందాలని కోరారు. పాల్గొనే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఇతర వివరాలకు 9951895211, 9849504635, 9700143423, 9848531097,స్వర్ణ శివ:8008119293 నంబర్లలో సంప్రదించవచ్చు.

Tags: Awareness Seminar on the Right to Information Act in Vijayawada