April 9, 2026
Explore
59 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడిన ముఠా అరెస్ట్.

59 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడిన ముఠా అరెస్ట్.

April 9, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • మూడు సంవత్సరాల పాటు దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న దొంగల ముఠా.
  • 5 నుండి 10 వేల రూపాయల విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ కోసం సుమారు 83 లక్షల విలువైన ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి రైతులకు ఆర్ధికంగా, పంటల సంరక్షణలో ఇబ్బంది కలిగించి నష్టం కలిగిస్తున్న దొంగలు.
  • రాగి వైర్ల దొంగతనం కోసం వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్న దొంగల ముఠా.
  • ఒక వైపు పంట నష్టం మరో వైపు కొత్త ట్రాన్స్ఫార్మర్లను అమర్చడంలో ఆలస్యంతో రైతులకు తీవ్రమైన ఇబ్బందులు.
  • రైతుల ఇబ్బందులను గుర్తించి, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ.
  • రైతులను ఇబ్బందులకు గురి చేసిన నిందితులపై కఠిన చర్యలు – PD యాక్ట్ నమోదు దిశగా చర్యలు.
  • తిరుపతి జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ట్రాన్స్ఫార్మర్ దొంగతన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం, మూడు సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుంటున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి గుట్టు రట్టు చేసింది. ఈ ముఠా సుమారు 59 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్లను దొంగిలించినట్లు విచారణలో తేలింది.
  • ఈరోజు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో వివరాలను క్రైమ్ అదనపు ఎస్పీ A. శ్రీనివాసులు మరియు చంద్రగిరి డియస్సీ బేతపూడి ప్రసాద్ గారు వెల్లడించారు.
  • ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ రైతుల జీవనాధారమైన వ్యవసాయానికి భంగం కలిగించే ఇటువంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని . చిన్న మొత్తంలో లాభం కోసం కోట్లాది రూపాయల నష్టం కలిగించే దొంగలపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. అవసరమైతే PD యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
  • వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేయడం వల్ల రైతులు ఒకవైపు పంట నష్టాన్ని, మరోవైపు విద్యుత్ సరఫరా లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సంఘటనలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది అని తెలిపారు.
  • దొంగ సొత్తు కొనుగోలు చేసే వారూ నేరస్తులే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించము కఠినంగా వ్యవహరిస్తాం అని స్పష్టం చేశారు.
  • ఈ ముఠా 5 నుండి 10 వేల రూపాయల విలువైన రాగి వైర్ల కోసం సుమారు రూ.83 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించినట్లు గుర్తించారు.
  • రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ క్రైమ్ అదనపు ఎస్పీ A. శ్రీనివాసులు మరియు చంద్రగిరి డియస్సీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎక్కడా అరెస్ట్ కాని నలుగురు నిందితులను 08-04-2026 రాత్రి రామచంద్రాపురం మండలం ముత్యాలమ్మ గుడి ఆర్చ్ సమీపంలో అరెస్ట్ చేశారు. వారి విచారణలో తిరుపతి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 19 కేసులకు సంబంధించి 59 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
  • నిందితుల వద్ద నుండి సుమారు రూ.2.72 లక్షల విలువ గల 252 కేజీల రాగి వైర్లు, నేరానికి ఉపయోగించిన మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
  • దొంగతనానికి సంబంధించిన రాగి వైర్లను కొనుగోలు చేసిన ముగ్గురు రిసీవర్లపై కూడా కేసులు నమోదు చేసి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
  • అరెస్ట్ కాబడిన ముద్దాయిలు:
  • 1. పరమాల చంద్రయ్య, @ నాసోడు, వ 45 సం. తండ్రి. లేట్ చెంగయ్య, తాటికొన, డోర్నకంబాల, చంద్రగిరి మండలము, తిరుపతి జిల్లా.
  • 2. గాలి బాలాజీ, వ 46 సం. తండ్రి లేట్ సుబ్బరామయ్య, సవటకాలువ, డోర్నకంబాల, చంద్రగిరి మండలము, తిరుపతి జిల్లా.
  • 3. తుపాకుల పవన్ కుమార్, @ కళ్యాణ్, వ 24 సం తండ్రి. ఆదయ్య, సవటకాలువ, దొర్నకంబాల, చంద్రగిరి మండలము, తిరుపతి జిల్లా.
  • 4. అక్షల నాగరాజు, వ 25 సం. తండ్రి కోటయ్య, యానాది సెంటర్, అన్నారావ్ సర్కిల్, తిరుపతి జిల్లా.
  • దొంగ సొత్తు కొన్న వ్యక్తులు:
  • 1. హేమంత్, గోరపల్లిగుంట, నాయుడు పేట ( ఇతని ఆద్వర్యం లో పై తెలిపిన ట్రాన్స్ఫార్మర్ దొంగలు చోరీకి పాల్పడినారు).
  • 2. శ్రీకాంత్ రెడ్డి, చెర్లోపల్లి, తిరుపతి రూరల్ మండలం.
  • 3. వల్లెమ్మ, భవానీ నగర్, చంద్రగిరి
  • ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు ఇన్స్పెక్టర్ M.సురేష్ కుమార్, RC పురం PS యస్. ఐ M. భక్తవత్సలం మరియు పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, వేంకటేశులు, శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి మరియు కానిస్టేబుల్ C. మహేష్, చంద్రగిరి PS SI శ్రీ B. రవి ప్రకాష్ రెడ్డి, కానిస్టేబుళ్లు మునిరత్నం, శ్రీనివాస రావు, గిరిబాబు, సూర్యనారాయణ లను జిల్లా ఎస్పీ అభినందించి, వారికి రివార్డ్ అందజేయనున్నట్లు తెలిపారు.

Tags:Gang involved in 59 transformer thefts arrested.