మధ్యప్రదేశ్ ముచ్చట్లు:
ఇండోర్లో 3 అంగుళాల పొడవున్న బతికున్న చేపను మింగిన ఏడాది బాలుడు, సర్జరీ చేసి బయటకు తీసిన వైద్యులు..
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఏడాది బాలుడు ఆడుకుంటూ 3 అంగుళాల చేపను నోట్లో పెట్టుకోగా, అది గొంతులో ఇరుక్కుపోయింది.
చేప మొప్పల కదలికల వల్ల బాలుడి అన్నవాహిక, శ్వాసనాళం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆ చేపను బయటకు తీశారు.
సకాలంలో స్పందించడంతో బాలుడు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.
Tags;One-Year-Old Boy Swallows Live Fish