రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి వీధి కుక్కల గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతు గంప శ్రీనివాసులు గొర్రెల కొట్టంలోకి చొరబడిన కుక్కలు, ఒకేసారి 14 పొట్టేళ్లను కొరికి చంపేశాయి. రైతు గమనించి వాటిని తరిమికొట్టే లోపే భారీ నష్టం వాటిల్లింది.
అప్పు తెచ్చి పొట్టేళ్లను పెంచుకుంటున్న ఆ నిరుపేద కుటుంబం ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరణించిన పొట్టేళ్ల విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. వీధి కుక్కల సంచారంతో భయాందోళన చెందుతున్న ప్రజలు, తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Tags: Stray Dog Attack in Nallaguttapalli: 14 Rams Killed