లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ(55 సుమారు) తన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రామకృష్ణ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుండగా, గత పది రోజులుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఉదయం పొలం వద్ద చెట్లకు నీళ్లు పెట్టి ఇంటికి వచ్చిన ఆయన, మధ్యాహ్నం ఇంట్లోనే ఉన్నాడు. అయితే, కొంతసేపటి తర్వాత ఆయన భార్య తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో లోపలికి చూడగా రామకృష్ణ ఉరేసుకున్నట్లు గమనించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags: Tragedy in Konampeta – Teacher Commits Suicide