అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో న్యాయవాది పూజారి యల్లయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఎస్పీ ధీరజ్ వివరాల ప్రకారం, కేవీ పల్లి మండలం పాత వడ్డేపల్లి గ్రామంలో ఆధిపత్య పోరు కారణంగా ఈనెల 6న రాత్రి నిందితులు పథకం ప్రకారం ఇంటిపై దాడి చేసి, యల్లయ్యను బండరాళ్లతో మోది హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులను కూడా దారుణంగా కొట్టారు.
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన బండరాళ్లు, కట్టెలు, రెండు బైకులు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.
Tags: Lawyer Murdered Over Old Enmities; Five Arrested