April 9, 2026
Explore
సీప్ స్వర్ణోత్సవాల్లో రాయచోటి పూర్వ విద్యార్థులు

సీప్ స్వర్ణోత్సవాల్లో రాయచోటి పూర్వ విద్యార్థులు

April 9, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజలు ఈనెల 6 నుండి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్ చివరి రోజున హాజరయ్యారు. 1991–1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులుగా సెంటర్‌తో తమకున్న అనుబంధాలను పంచుకున్నారు.

సీప్ విభాగం అంచలంచలుగా ఎదుగుతూ దేశంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంచాలకులు వూక రమేష్ బాబు, విభాగ మాజీ సంచాలకులు ఆచార్య రాజారెడ్డి, మునిరత్నంరెడ్డి, జయచంద్రారెడ్డి, ఆచార్యులు విజయ్ కుమార్ రెడ్డి, ప్రయాగ, పద్మజ, తిమ్మప్ప పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Former Students of SEAP at the Golden Jubilee Celebrations