April 8, 2026
Explore
తమిళనాడు ఎన్నికల్లో I.N.D.I.A కూటమి దే విజయం

తమిళనాడు ఎన్నికల్లో I.N.D.I.A కూటమి దే విజయం

April 8, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:


పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూర్ జిల్లా, పొన్నేరి నియోజకవర్గము నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొరై చంద్రశేఖర్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు.డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ తమిళనాడు నందు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో I.N.D.I.A కూటమి దే విజయమని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని రాబోవు రోజుల్లో తమిళనాడులో, అదేవిధంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం తద్యమని తెలిపారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతారని అదేవిధంగా భారత దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాబోవు రోజులు కాంగ్రెస్ పార్టీవేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరపు రమేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మ దేవదానం, జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీను గౌడ్,OBC జిల్లా అధ్యక్షులు బాలరాజు, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు SK రాజిక్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, తడ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:The I.N.D.I.A alliance wins in the Tamil Nadu elections.