పుంగనూరుముచ్చట్లు:
విద్యార్థులు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు వీలుందని సీఐ సుబ్బరాయుడు సూచించారు. బుధవారం రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో గ్రాడ్యూయేషన్‌డేను డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు చైతన్యతేజారెడ్డి, లక్ష్మీసంగీత తో పాటు సీఐ హాజరైయ్యారు. విద్యార్థులకు అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివే సమయంలో విద్యార్థులు భయం , ఒత్తిడి, ఆవేషాలకు లోనుకాకుండ చదువుపై దృష్టి సారించి ఉత్తీర్ణులు కావాలన్నారు. మొబైల్‌ఫోన్లు, వ్యాట్సాప్‌లు జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ రమణతో పాటు ఉపాధ్యాయులు రజిని, జలజ, వనజ, షాహినా, రెడ్డమ్మ, రేణుక, ముబారక్, శివశంకర్, సత్య, అమృత, లక్ష్మి, కేశవరెడ్డి, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Reaching Lofty Heights Through Discipline