April 8, 2026
Explore
మున్సిపాలిటిలో 36 వార్డులు ఏర్పాటు

మున్సిపాలిటిలో 36 వార్డులు ఏర్పాటు

April 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటిలో ప్రస్తుతం 63,552 మంది జనాభా ఉన్నారు. అందులో 2011 లెక్కల ప్రకారం 44,452 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 31 వార్డులను ఏర్పాటు చేసి పరిపాలన సాగించారు. కాగా తాజా ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిలో 36 వార్డులను ఏర్పాటు చేసి , ఒకొక్క వార్డుకు 1200 ఓటర్ల నుంచి 1400 మంది ఓటర్లు ఉండేలా వార్డుల సంఖ్యను పెంచారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నివేదికలను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పాలకవర్గంలో 36 మంది కౌన్సిలర్లు, ముగ్గరు కో ఆఫ్షన్‌ మెంబర్లు ఉంటారు. ప్రస్తుతం వార్డులు పెరిగిన కారణంగా కో ఆఫ్షన్‌ మెంబర్ల సంఖ్య కూడ మరో రెండు పెరిగి 41 మంది పాలకవర్గ సభ్యులుగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా 41 మంది నిరుద్యోగులకు మున్సిపాలిటిలో కౌన్సిలర్‌ పదవులు దక్కించుకునేందుకు పోటీ పడేందుకు అన్ని పార్టీల నాయకులు వార్డుల విభజన అనుకూలం అని, ప్రతికూలం అని చర్చించుకుంటు వార్డుల్లో తిరుగుతున్నారు.

Tags: 36 Wards Established in the Municipality