April 8, 2026
Explore
పాలన లేకపోవడంతో పత్తాలేని పారిశుద్ధ్యం

పాలన లేకపోవడంతో పత్తాలేని పారిశుద్ధ్యం

April 8, 2026 | Andhra Pradesh

మురుగునీటి నిల్వలు

  • తొలగించని చెత్త దిబ్బలు
  • ప్రభలుతున్న దోమలు

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి మున్సిపల్‌ పాలకవర్గ పదవికాలం పూర్తికాబడి 20 రోజులకే పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అస్థవ్యస్థంగా తయారైంది. అధికారుల నిర్లక్షం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. మూడు, నాలుగు రోజులు గడిచిన చెత్తదిబ్బలు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు జ్వరాల భారీన పడుతున్నారు. మున్సిపాలిటిలో 31 వార్డులు ఉన్నాయి. వైఎస్సార్‌సిపి కౌన్సిలర్లు, చైర్మన్‌ ఉండటంతో ప్రతి రోజు పాలకవర్గ సభ్యులు తమ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీటి సరఫరా , వీధి దీపాల పై పర్యవేక్షణ నిర్వహించారు. ఇలా ఉండగా పాలకవర్గ పదవికాలం గత నెల 17న ముగిసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, చెత్తను ప్రతి రోజు తొలగించాలన్న నిబంధనలను ప్రక్కన పెట్టారు. కుంటి సాకులతో కొన్ని ప్రాంతాలలో మాత్రమే చెత్తను తొలగించడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా శానిటరీ సిబ్బంది తమకు కేటాయించిన పనులను మాత్రమే నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు పారిశుద్ధ్య కార్యక్రమాల పేరుతో ఖర్చు చేస్తున్న పట్టణంలో మాత్రం పారిశుద్ధ్యం పత్తాలేకుండ పోవడం, ఖర్చులు మాత్రం మున్సిపల్‌ నిధుల్లో డ్రా చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

పత్తాలేని పారిశుద్ధ్యం…..

పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి ముందు చెత్తదిబ్బలు, మురుగునీటి నిల్వల తో ఆప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎంఎస్‌ఆర్‌ •యేటర్‌కు వెళ్లే సమీపంలో నడిరోడ్డుపై చెత్తను తొలగించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పువెహోగసాల, ఎంబిటి రోడ్డులోని గాంధినగర్‌ వద్ద మురుగునీటి నిల్వలు తీవ్రమై రోడ్డుపైకి చేరుతోంది. అలాగే నక్కబండ, ఎన్‌ఎస్‌.పేట, యూబికాంపౌండు, ఏటిగడ్డపాళెంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అద్వాన్నంగా ఉన్నాయి. వీటిని తొలగించకపోవడంతో ఆప్రాంతాలు దుర్గంధభరితమౌతోంది. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైన అధికారులు స్పందించి , ప్రతి రోజు చెత్త, ముగునీటిని తొలగిస్తారా…లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

పత్తాలేని పర్యవేక్షణ….

లక్షలాది రూపాయలు పారిశుద్ధ్య కార్యక్రమాలకు మున్సిపాలిటి నుంచి ఖర్చుచేస్తున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పాలకవర్గం లేకపోవడం, ప్రజలు అడిగిన పట్టించుకునే వారు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు.

  • రషీదబేగం, నక్కబండ, పుంగనూరు.

ప్రజల కష్టాలు తీర్చండి….

మున్సిపాలిటిలో అధికారులకు ఇతర పనులపై ఉన్న శ్రద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలపై లేకపోవడమే పారిశుద్ధ్య లోపానికి కారణం. ప్రతి చోట మురుగునీటి నిల్వలు, చెత్త దిబ్బలతో పట్టణం దుర్గంధభరితమౌతోంది. అధికారులు ఇకనైన వీటిపై దృష్టి సారించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలి.

  • అస్లాంమురాధి, మైనార్టీల నాయకుడు, పుంగనూరు.

Tags: With a lack of governance, sanitation has vanished without a trace.