April 8, 2026
Explore
23న బ్రాహ్మణుల ఉపనయనాలు

23న బ్రాహ్మణుల ఉపనయనాలు

April 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శ్రీగాయత్రిమాత తాలూక బ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉపనయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధి రామమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతియేటా నిర్వహించే రీతిలో బ్రాహ్మణ వటులకు ఉపనయన కార్యక్రమాలు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపనయనాలు చేసుకోదలచిన వారు సంఘ ప్రతినిదులను సంప్రదించాలని కోరారు.

Tags: Brahmin Upanayanams on the 23rd