April 8, 2026
Explore
ఆవేశం తో బావను బలి తీసుకున్న బామ్మర్ది..

ఆవేశం తో బావను బలి తీసుకున్న బామ్మర్ది..

April 8, 2026 | Andhra Pradesh

లేపాక్షి ముచ్చట్లు:

తన చెల్లి కి పెళ్లైన 11 నెలలు ఇంతలో ఆమెకు భర్త ద్వారా వేధింపులు…తట్టుకోలేక అన్నకి చెప్పింది చెల్లి…ఆవేశం తో బావను బలి తీసుకున్న బామ్మర్ది..

చెల్లెలు కాపురం నిలబడటం కోసం అన్న ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆఖరికి చంపడానికైనా వెనుకాడని అన్నలు ఉన్నారు. చెల్లెలు కాపురం నిలబడటం కోసం ఏం చేసిన పర్వాలేదు కానీ, ఏకంగా చెల్లెలు భర్తనే చంపేస్తే..! ఇంకేం కాపురం నిలబడుతుంది. చెల్లెలిని నిత్యం అనుమానిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని సొంత బావనే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది

లేపాక్షి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి చెల్లెలు మేఘనకు 11 నెలల క్రితం బెంగుళూరు శివారులోని ఎలహంకలో నివాస ముద్దుల వినయ్ కుమార్ తో వివాహం జరిగింది. వినయ్ కుమార్ అన్న నితీష్ కుమార్ తో కలిసి బెంగళూరులో ఓ చిన్న ప్రైవేట్ కంపెనీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వినయ్ తోపాటు భార్య మేఘన కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తుంది. కొద్దిరోజులు బాగానే ఉన్న వినయ్ – మేఘన కాపురంలో.. అనుమానపు బీజం పడింది

భార్య మేఘనపై భర్త వినయ్ కుమార్ అనుమానం పెంచుకున్నాడు. తరచూ భార్య మేఘన అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి తోడు మీ చెల్లెలు ప్రవర్తన సరిగా లేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. బావమరిది రాజుకు ఫోన్ చేసి అవమానించేవాడు. దీంతో చెల్లెలు భర్త వినయ్‌పై కోపం పెంచుకున్న బావమరిది రాజు.. పక్కా ప్లాన్ ప్రకారం బావ వినయ్ కుమార్‌ను చంపేందుకు స్కెచ్ వేశాడు.. వినయ్ కుమార్‌ను స్వగ్రామమైన వెంకటాపురానికి పిలిపించిన రాజు.. గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద చెల్లెలు భర్త వినయ్ కుమార్ ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని మోటార్ బైక్ తోపాటు హంద్రీనీవా కాలువలో పడేశాడు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత కాలువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.

Tags: Brother-in-law claims brother-in-law’s life in a fit of rage.