లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల మదనమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవ ఎన్నిక కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు.
Tags:Yanamala Madanamohan elected unanimously as ZPTC member for Lakkireddypalli