పుంగనూరు ముచ్చట్లు:
లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ మరియు ఇంటాక్ స్వచ్ఛంద సంస్థ వీరి సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు కొత్త ఇండ్లు ప్రభుత్వ పాఠశాల నందు ఒక నెల రోజుల పాటు కంప్యూటర్ లెర్నింగ్ కోర్సులు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడును. కావున ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ క్లబ్ మరియు ఇంటాక్ సంస్థ వీరి యొక్క ప్రోత్సాహక సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది .కావున విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
Tags;Computer Learning Courses: Free Training