September 11, 2026
Explore
హోటల్ యజమాని పరారీ

హోటల్ యజమాని పరారీ

September 11, 2026 | Andhra Pradesh

చిట్వేల్ ముచ్చట్లు:

  • అప్పులు ఇచ్చిన వారు ఆందోళన
  • బుధవారం రాత్రి నుంచి ఫోన్ స్విచ్‌ఆఫ్
  • ఆచూకీ లేకపోవడంతో కలకలం

చిట్వేల్ లో హోటల్ నిర్వహిస్తూ స్థానికంగా అందరితో పరిచయాలు పెంచుకున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి నుంచి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఆచూకీ లేకుండా పోయాడన్న విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సదరు హోటల్ యజమాని వద్ద పలువురు అప్పులు ఇచ్చినట్లు తెలుస్తుండటం తో వారిలో ఆందోళన మొదలైంది. తమ డబ్బుల పరిస్థితి ఏమిటో తెలియక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎ న్నికల కాలంగా హోటల్ నిర్వహిస్తూ చుట్టు పక్కల వారితో సన్నిహితంగా మెలిగిన సదరు వ్యక్తి పలువురి వద్ద అప్పులు తీసుకున్నట్లు సమాచారం. అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి కొందరి నుంచి పెద్ద మొత్తాల్లో నగదు తీసుకున్నట్లు అప్పులు ఇచ్చిన వారు చెబుతున్నారు. అయితే బుధవారం రాత్రి నుంచి ఆయన ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో పాటు ఆచూకీ కూడా లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

భార్యకు చూపింఛి వస్తానని నెక్లెస్ తీసుకెళ్లాడని ఆరోపణకు సన్నిహితంగా ఉన్న మిత్రుడిని సైతం నమ్మించి ఇబ్బందుల్లోకి నెట్టినట్లు మరో ఆరోపణ వినిపిస్తోంది. తన కుమార్తె వద్ద ఉన్న నెక్లెస్ తరహాలోనే తన కుమార్తె కోసం ఒక నెక్లెస్ కొనగోలు చేయాలని ఉందని చెబుతూ, ఓ వ్యక్తి వద్ద ఉన్న నెక్లెస్‌ను తన భార్యకు చూపింఛి వస్తానని తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరిగి ఇస్తానని చెప్పి నెక్లెస్ తీసుకెళ్లిన అనంతరం ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడని బాధితులు చెబుతున్నారు.దీంతో ఇప్పటికే ఆయనకు అప్పులు ఇచ్చిన వారితో పాటు ఇతర పరిచయస్తుల్లోనూ ఆందోళన నెలకొంది. తమ వద్ద తీసుకున్న మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు. గత ఘటనలను గుర్తుచేసుకుంటున్న ప్రజలు ఇలా ఉండగా, గతంలోనూ ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిస్థానికంగా వ్యాపారం ప్రారంభించి, కొంతకాలం అందరి నమ్మకాన్ని సంపాదించిన అనంతరం పలువురి వద్ద అప్పులు తీసుకుని కనిపించకుండా పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. కొందరు అధిక వడ్డీ ఇస్తామనే హామీలతో డబ్బులు సమీకరించి, ఆ తర్వాత పారైన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం జరిగిన ఘటన కూడా అదే తరహాలో ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అప్పులు ఇచ్చినవారు తమ డబ్బులు తిరిగి వస్తాయా? రావా? అనే ఆందోళనలో ఉండగా.. మరోవైపు సదరు వ్యక్తి బుధవారం రాత్రి నుంచి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఆచూకీ లేకుండా పోవడంతో అసలు విషయం ఏమిటన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తత శ్రీరామరక్షఅధిక వడ్డీ వస్తుందనే ఆశతో సరైన పత్రాలు, హామీలు లేకుండా పెద్ద మొత్తాల్లో డబ్బులు అప్పుగా ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వ్యక్తిగత పరిచయాలు, నమ్మకాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఆర్థిక లావాదేవీలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సదరు వ్యక్తి నిజంగానే అప్పులు తీసుకుని పరారయ్యాడా? లేక ఇతర కారణాలతో అందుబాటు లో లేకుండా ఉన్నాడా? అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వడ్డీ ఆశ చూపే వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags; Hotel owner absconding