రాయచోటి ముచ్చట్లు:
బీసీ చైతన్య శాంతి ర్యాలీ
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 18న రాయచోటిలో బీసీ చైతన్య శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జనసేన నాయకుడు విజయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు MRO కార్యాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ర్యాలీలో సుమారు 200 నుంచి 500 మంది పాల్గొంటారని తెలిపారు. ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరినట్లు విజయ్ వెల్లడించారు.
Tags: BC Awareness and Peace Rally in Rayachoti on the 18th