April 7, 2026
Explore
కామాటిపురాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

కామాటిపురాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

April 7, 2026 | Andhra Pradesh

కామాటిపురా ముచ్చట్లు:

పేదలకు అందాల్సిన పౌరసరఫరాల (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును కామాటిపురా పోలీసులు రట్టు చేశారు. దేవీబాగ్ ప్రాంతంలో అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ సోదాల్లో ఓ లారీలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 80 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ సమాచారాన్ని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టుబడిన బియ్యాన్ని ఉన్నతాధికారుల సమక్షంలో పౌరసరఫరాల శాఖకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags; Huge Cache of Ration Rice Seized in Kamathipura