April 7, 2026
Explore
డ్వాక్రా అధికారుల వేధింపులు తాళలేక సభ్యురాలు ఆత్మహత్యాయత్నం

డ్వాక్రా అధికారుల వేధింపులు తాళలేక సభ్యురాలు ఆత్మహత్యాయత్నం

April 7, 2026 | Andhra Pradesh

మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని ఆవేదన

తన సంతకం లేకుండానే ఫోర్జరీ చేసి తొలగించారంటూ ఆరోపణలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు డ్వాక్రా మహిళ

మోపిదేవి ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పథకాలలో ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన ద్వాకా సంఘాలు నేడు అధికారుల అలసత్వము, అవినీతి కారణంగా డ్వాక్రా సంఘాల లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.

మోపిదేవి మండలంలోని కె కొత్తపాలెం పంచాయతీ శివారు ఉత్తర పాలెం గ్రామానికి చెందిన కాకర్లమూడి వాణి.. మేరీ గ్రూపులో సభ్యురాలుగా ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం 9 మంది సభ్యులుగా ఉన్న గ్రూపు నుండి. గ్రూపు అధ్యక్షురాలు ముఖ్యపరు లు కలిసి తనను అన్యాయముగా తొలగురించి పొదుపు డబ్బులు కట్టించుకోవడం లేదు. నా సంతకం లేకుండా ఎలా తొలగిస్తారు అంటూ మోపిదేవి మండల ఏపిఎం సీసీ ల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ గారు డ్వాక్రా పిడి గారు దృష్టికి మూడు సంవత్సరాలుగా తీసుకువెళ్లిన ఏ ఒక్కరు పట్టించుకోవడంలేదని బాధ్యతరాలు తెలిపారు. సంతకం లేకుండా ఆమెకు తెలియజేయకుండా తొలగించసామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె అధికారులకు తెలియజేసిన కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ వచ్చారు. తనకు తెలిసిన సమాచారం ద్వారా వివరాలు సేకరించగా తనను గ్రూపు నుంచి తొలగించకుండా ఫోర్జరీ సంతకాలతో సంఘాolo నడిపిస్తూ తన పేరు మీద బ్యాంకు లింకేజీ లోనూ తీసుకొని వారి పంచుకున్నట్లు ఆమె ఆరోపించారు

ఈ విషయాలను జిల్లా కలెక్టర్ డ్వాక్రా పిడి మోపిదేవి మండల ఏపీఎంల దృష్టికి తీసుకువెళ్లి గ్రూపుకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించితే వాస్తవాలు తేటతెలమవుతాయని ఆమె అనేక పర్యాయాలు చెప్పిన ఏ ఒక్కరు పట్టించుకోలేదని బంధువులు తెలిపారు.గ్రూపు నుంచి తొలగించామంటూ అసత్య ప్రచారాలు చేయటమే కాకుండా 70 వేల రూపాయలు చెల్లిస్తే నీకు న్యాయం చేస్తామని మోపిదేవి మండల డ్వాక్రా అధికారులు పదేపదే అనటంతో జిల్లా స్థాయి అధికారులు కూడా సమస్య పరిష్కారం చేయడంలో సర్వచోపకపోవడంతో ఆవేదనకు చెంది మనస్థాపానికి లోనై ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె తెలిపారు.మూడు సంవత్సరాలుగా మండల జిల్లా అధికారుల చుట్టూ న్యాయం చేయమని తిరుగుతున్న ఏ ఒక్కరు పట్టించుకోవటం లేదంటూ బాధ్యత మహిళ ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం చల్లపల్లి ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

Tags: DWCRA Member Attempts Suicide, Unable to Endure Harassment by Officials